Raja Singh: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత రాజాసింగ్ తన రాజీనామా నిర్ణయంపై స్పందించారు. పదవి లేదా అధికారం కోసం బీజేపీలో చేరలేదని స్పష్టం చేస్తూ, హిందుత్వ రక్షణ కోసం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు వెల్లడించారు.
11 ఏళ్ల సేవా ప్రయాణం:
“11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరాను. అప్పటి నుంచి హిందుత్వం కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నాను. బీజేపీ నన్ను నమ్మి మూడు సార్లు గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది,” అని రాజాసింగ్ తెలిపారు.
రాజీనామా నిర్ణయం వెనుక కారణం:
తాను తీసుకున్న రాజీనామా నిర్ణయం రాజకీయ లబ్ధి కోసమో, పదవి ఆశ కోసం కాదని స్పష్టంచేశారు. తనపై నమ్మకంతో అవకాశాలు కల్పించిన బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. “నాపై నమ్మకం ఉంచిన బీజేపీ నేతలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు,” అంటూ ఆయన అన్నారు.