Murder case: వివాహేతర బంధాలు కన్నవాళ్లను, కట్టుకున్నవారినే కడతేర్చేదాకా దారితీసే ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. ఇదే కోవలో హైదరాబాద్ నగరంలో మరో ఘటన చోటుచేసుకున్నది. ఇక్కడ విచిత్రమేమిటంటే? కన్నబిడ్డ, కట్టుకున్న భార్య ఇద్దరూ కలిసి తమ వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని ఓ వ్యక్తిని హతమార్చారు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టు ఆ కూతురు తన ప్రియుడితో కలిసి ఎంచక్కా సెకండ్ షో సినిమాకు వెళ్లింది. ఇది కలికాలం అనుకోవాలో? కామంతో కళ్లు మూసుకుపోయిన కనికరం లేని కాలం అనుకోవాలో? అర్థంకాని పరిస్థితి నెలకొన్నది.
Murder case: హైదరాబాద్ కవాడిగూడ ముగ్గుల బస్తీకి చెందిన వడ్లూరి లింగం (45) ఒక అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య శారద (40) జీహెచ్ఎంసీలో స్వీపర్‌గా పనిచేస్తున్నది. వారి కూతురు మనీషాకి వివాహం జరగగా, జావీద్ (24) అనే వ్యక్తితో వివాహేతర బంధం ఉన్నదని ఆమెను భర్త వదిలేశాడు.
Murder case: ఆ తర్వాత మౌలాలీలో అద్దె ఇంటిలో తన ప్రియుడు జావీద్‌తో కలిసి మనీషా నివాసం ఉంటున్నది. కూతురు వేరే వ్యక్తితో కలిసి ఉండటం నచ్చని తండ్రి లింగం తరచూ మనీషాతో గొడవ పడుతున్నాడని తండ్రిపై కోపం పెంచుకున్నది. తనను కూడా అనుమానిస్తున్నాడని, వేధిస్తున్నాడని శారద కూడా తన కూతురుకు చెప్పుకొన్నది. దీంతో ఇద్దరూ కలిసి లింగం అడ్డు తొలగించుకునేందుకు హత్య చేయాలని ప్లాన్ చేశారు.
Murder case: జూలై నెల 5న మనీషా ఇచ్చిన నిద్రమాత్రలు కలిపిన కల్లును తన భర్త లింగానికి శారద ఇచ్చింది. అపస్మారక స్థితిలోకి వెళ్లాక లింగం మొహంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి కూతురు మనీషా, ఆమె ప్రియుడు జావీద్, తల్లి శారద కలిసి చంపేశారు. ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి మనీషా సెకండ్ షో సినిమాకు వెళ్లి సినిమా పూర్తయ్యాక తండ్రి శవాన్ని ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామ చెరువులో పడేసి వచ్చారు.
Murder case: జూలై నెల 7న ఏదులాబాద్ చెరువులో మృతదేహం తేలిందన్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. ఆ మృతదేహం లింగం అనే వ్యక్తిది అని గుర్తించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను విచారించారు. ఈ సమయంలోనే వారిచ్చిన సమాధానాలపై అనుమానం రావడంతో సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది.
Murder case: సీసీ కెమెరాల ఆధారంగా కూతురు మనీషాయే తన తండ్రి లింగంను హత్య చేసిందని పోలీసుల నిర్ధారించారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెతోనే అసలు విషయాన్ని కక్కించారు. తన వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడనే తండ్రి చంపినట్టు విచారణలో మనీషా అంగీకరించింది. దీనికి తల్లి, తన ప్రియుడు సహకరించినట్టు ఒప్పుకున్నది.

