Vishwak Sen: టాలీవుడ్ యాక్టర్ ఫిష్ వెంకట్ కిడ్నీ ఫెయిల్ అవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్జెంటుగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చెయ్యాలని డాక్టర్స్ చెప్పారని.. అందుకు 50 లక్షలు అవసరం అవుతుందని.. సినీ పెద్దలు సాయం చేయాలంటూ ఆయన కుమార్తె స్రవంతి విజ్ఞప్తి చేశారు. రీసెంట్ గా మాస్ కా దాస్ విశ్వక్ సేన్, తనవంతుగా రెండు లక్షలు హెల్ప్ చేశారు.ఫిష్ వెంకట్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.. ట్రీట్ మెంట్ కి దాదాపు 50 లక్షలు అవసరం అవుతుందని, సినీ పెద్దలు సాయం చేయాలని ఆయన కుమార్తె స్రవంతి రిక్వెస్ట్ చేశారు.
అయితే వైద్యానికి అవసరమైన ఖర్చు తాను పెట్టుకుంటానని.. కిడ్నీ డోనర్ ని చూసుకోండని ప్రభాస్ చెప్పినట్టు వార్తలు వైరల్ అయ్యాయి కానీ.. అసలు ఆ ఫోన్ కాల్ ఎక్కడినుండి వచ్చిందనేది క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు విశ్వక్ సేన్ తనవంతుగా రెండు లక్షల రూపాయలు హెల్ప్ చేశారు. చిన్న హీరో అయినా పెద్ద మనసు చాటుకున్నాడంటూ విశ్వక్ మీద అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.. అలాగే గబ్బర్ సింగ్ టీమ్ కూడా కొంత సాయం చేశారు. ఈ సందర్భంగావారితో కలిసి విశ్వక్ కు ఫిష్ వెంకట్ కుమార్తె థ్యాంక్స్ చెప్ప్పారు. మరికొంతమంది సినీ ప్రముఖులు ముందుకొచ్చి తన తండ్రి వైద్యానికి సాయం చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారామె.