Chandrababu Naidu: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 14-16 వరకు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 14న సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్ళి, మూడు రోజుల పాటు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జలశక్తి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశం కానున్నట్టు సమాచారం.
