Hari Hara Veeramallu Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. చాలా కాలంగా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చిన ఈ చిత్రం జూలై 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
చిత్రబృందం తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. దాదాపు 3 నిమిషాల 1 సెకను నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ యోధుడిగా పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన ఎలివేషన్ సీన్స్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచగా, ట్రైలర్ అదిరిపోయిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

