Pakistani Actress: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక అమాయక యువకుడిని భారీగా మోసగించిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. పాకిస్తాన్‌కు చెందిన నటి పర్వరీష్ షా ఫొటోలు డీపీగా పెట్టుకుని, తానే ఆ నటిని అంటూ ఇద్దరు మోసగాళ్లు భారీ మోసం చేశారు.
బహదూర్‌పురాకు చెందిన 29 ఏళ్ల యువకుడు ఓ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో తన బయో డేటా పోస్టు చేశాడు. 2023లో అతని ఫోన్ నంబర్ ఓ గ్రూప్‌లో షేర్ అవడంతో అసలు కథ మొదలైంది.
“ఫాతిమా” అనే యువతి అతనితో పరిచయం అయింది. తాను పాకిస్తాన్ నటి పర్వరీష్ షా అని చెప్పింది. ఆమే సోదరినంటూ “అనీసా హుండేకర్” అనే మరొక యువతి కూడా పరిచయమైంది.
ఇది కూడా చదవండి: Psycho Husband: సైకో మొగుడు…భార్య పిల్లల్ని అమెరికాలో వదిలేసి వచ్చిన భర్త
తన తల్లి అనారోగ్యంతో ఉందని, వైద్యం కోసం డబ్బులు కావాలని ఫాతిమా వేడుకోవడం మొదలుపెట్టింది. మొదట కొంత డబ్బు పంపించాడు బాధితుడు. రెండు రోజుల్లోనే తిరిగి పంపించడంతో నమ్మకమెరిగింది.
ఈ నమ్మకంతో దశల వారీగా మొత్తం రూ.21.74 లక్షలు పంపించాడు. చివరికి అతడి నంబర్‌ను బ్లాక్ చేయడంతో అసలు విషయం తెలిసింది. వెంటనే బాధితుడు హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటన ఆధారంగా ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది – ఇంటర్నెట్‌లో పరిచయాలు చేస్తున్నపుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరో అని తెలిసే వరకు వ్యక్తిగత సమాచారం షేర్ చేయడం, డబ్బులు పంపించడం నివారించాలి.

