Preity Mukhundhan

Preity Mukhundhan: కన్నప్పని లైట్ తీసుకున్న ప్రీతీ ముకుందన్.. టీమ్ నిర్లక్ష్యమా?

Preity Mukhundhan: కన్నప్ప హీరోయిన్ ప్రీతీ ముకుందన్ చర్చనీయాంశమైంది. ప్రమోషన్లలో కనిపించని ఈ అమ్మాయి పాత్ర తక్కువ ప్రాధాన్యమని అందరూ భావించారు. కానీ, సినిమాలో ఆమెకు ప్రముఖ గూడెం మహారాణి కూతురిగా కీలక పాత్ర దక్కింది. మంచు విష్ణుతో రెండు రొమాంటిక్ సాంగ్స్‌తో పాటు మూడు ఎపిసోడ్‌లలో తన నటనతో అదరగొట్టింది. ఆశ్చర్యకరంగా, ప్రీతీ నుంచి ప్రమోషన్లకు సహకారం లేకపోవడం, ఈవెంట్లలో పాల్గొనకపోవడం గమనార్హం. మోహన్ లాల్, అక్షయ్ కుమార్‌లు హైలైట్ అయినా, ఆమె పాత్రకు సరైన ప్రాధాన్యం లభించలేదు. ఇది వ్యక్తిగత కారణాలా లేక టీమ్ నిర్లక్ష్యమా అనేది సస్పెన్స్‌గా మిగిలింది. ఇది ప్రీతీకి తొలి తెలుగు సినిమా కాదు. శ్రీవిష్ణు ‘ఓం భీం బుష్’లో నటించినా ఆమెకు పేరు రాలేదు. కానీ, కన్నప్పలో ఆమె నటన, గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం మలయాళంలో ‘మైనే ప్యార్ కియా’, తమిళంలో ‘ఇదయం మురళి’లో నటిస్తున్న ఆమె, గత ఏడాది ‘స్టార్’ సినిమాలోనూ మెరిసింది. కోలీవుడ్‌లో ఆఫర్లు వస్తున్నా, ఆమె సెలెక్టివ్‌గా ఉంటోందట.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Manchu Manoj: మంచు మనోజ్ కు నోటీసులు..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *