Mohit Reddy

Mohit Reddy: మద్యం కేసులో హైకోర్టును ఆశ్రయించిన మోహిత్‌రెడ్డి

Mohit Reddy: తాజాగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు, తుడా మాజీ చైర్మన్ మోహిత్‌రెడ్డి కీలక అడుగు వేశారు. మంగళగిరి సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని పోలీసులను ఆదేశించాలని హైకోర్టును మోహిత్‌రెడ్డి కోరారు.

సార్వత్రిక ఎన్నికల ముందు, వివిధ మార్గాల ద్వారా మద్యం అక్రమ లావాదేవీల నుంచి వచ్చిన డబ్బును చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీసుకున్నారని ఆరోపణలున్నాయి. తుడా చైర్మన్‌గా మోహిత్‌రెడ్డికి ప్రభుత్వం కేటాయించిన అధికారిక వాహనంలోనే ఆ డబ్బును తరలించారని, ఆ తర్వాత ఆ సొమ్మును ఎన్నికల ఖర్చుల కోసం పంచారని భాస్కర్‌రెడ్డి గన్‌మెన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు మోహిత్‌రెడ్డిని కూడా నిందితులుగా చేర్చారు. సిట్ నమోదు చేసిన ఈ మద్యం కేసులో మోహిత్‌రెడ్డి 39వ నిందితుడు (ఏ39)గా ఉన్నారు.

Also Read: CIBIL Score: సిబిల్ స్కోర్ లేకుంటే క‌ష్ట‌మే! తక్కువగా ఉందని ఎస్‌బీఐ ఉద్యోగం ఊస్ట్‌.. సమర్ధించిన చెన్నై హైకోర్టు

Mohit Reddy: తన తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయగానే మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ కోసం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై వాదనలు గురువారం పూర్తయ్యాయి. న్యాయాధికారి పి. భాస్కరరావు ఈ పిటిషన్లపై తీర్పును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు.

అదేవిధంగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మరియు చెరుకూరి వెంకటేష్ నాయుడుల కస్టడీ పిటిషన్‌పై తీర్పును కూడా జూన్ 30వ తేదీకి వాయిదా పడింది. వెంకటేష్ నాయుడుకు ఇంటి భోజనం అనుమతి, బెయిల్ మంజూరు అభ్యర్థనలపైనా అదే రోజు తీర్పు వెల్లడించనున్నారు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న పైలా దిలీప్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు కూడా ముగిశాయి. ఈ పిటిషన్‌పై తీర్పును జూలై 3వ తేదీకి వాయిదా వేసినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *