Ravi Teja: మాస్ మహారాజా రవితేజ మరో సంచలన సినిమాతో అలరించడానికి రెడీ అవుతున్నారు. ‘మాస్ జాతర’ చిత్రంతో ఫుల్ జోష్‌లో ఉన్న రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్‌ను హైదరాబాద్‌లోని భారీ సెట్లో మొదలుపెట్టారు. ఈ కామెడీ ఎంటర్టైనర్లో రవితేజ సరికొత్త స్టైలిష్ అవతారంతో అభిమానులను ఫిదా చేయనున్నారు.
Also Read: Coolie: ‘కూలీ’లో అమీర్ ఖాన్ సంచలనం.. ఎన్ని నిమిషాల స్క్రీన్ టైమ్ అంటే?
Ravi Teja: ప్రముఖ నటీనటులతో కీలక సన్నివేశాలు రూపొందుతున్నాయి. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా, 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్, రవితేజ మార్క్ హంగామాతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం!

