rajasthan

Rajasthan: ఘోర బస్సు ప్రమాదం.. 12 మంది మృతి!

Rajasthan: రాజస్థాన్‌లోని సికర్ జిల్లా లక్ష్మణ్‌గఢ్‌లో ఓ ప్రైవేట్ బస్సు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. 35 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లక్ష్మణ్‌గఢ్‌, సికార్‌లోని ఆసుపత్రులకు తరలించారు. ఏడుగురి పరిస్థితి విషమంగా మారడంతో జైపూర్‌కు తరలించారు.

మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో లక్ష్మణ్‌నగర్‌లోని కల్వర్టు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు సలాసర్ నుంచి నవల్‌గఢ్‌కు వెళ్తోంది. సలాసర్‌కు 68 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం అందజేస్తామన్నారు.

ఇది కూడా చదవండి: Bomb Threats: విమానాలకు కొనసాగుతున్న బెదిరింపులు..

Rajasthan: అధిక వేగం కారణంగా బస్సు లక్ష్మణ్‌గఢ్‌ పులియా నుంచి ఎడమవైపుగా జైపూర్‌-బికనీర్‌ రోడ్డు వైపు వెళ్లాల్సి వచ్చింది. అతివేగంతో బస్సు పూర్తిగా తిరగలేక నేరుగా కల్వర్టును ఢీకొట్టింది. బస్సు ముందు భాగం 3 నుంచి 4 అడుగుల భాగం బాగా దెబ్బతింది. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *