Janhvi Kapoor: ఇటీవల ‘దేవర’ చిత్రంతో తెలుగువారి ముందుకు వచ్చి హిట్ కొట్టిన జాన్వీ కపూర్ తదుపరి రామ్ చరణ్ తో సందడి చేయబోతోంది. ఏ మాత్రం టైమ్ దొరికినా వెకేషన్ కి చెక్కేసే కపూర్ సిస్టర్స్ తాజాగా ఓ దీవిలోని సముద్రపు నీటిలో సేదదీరారు. అందులో భాగంగా బికినీ బీజ్ వెకేషన్ లో చిల్ చేస్తూ సందడి చేశారు. జాన్వీ 2019లోని కిమ్ కర్దాషియన్ ‘డైమండ్ ఇయర్ రింగ్ ఇన్ ది ఓషన్’ ఎపిసోడ్ ను రీ క్రియేట్ చేసింది. ఈ వీడియోను ఖుషీ కపూర్ ఇన్ ష్టాలో షేర్ చేయటంతో అది వైరల్ అవుతోంది. ఆ వీడియలో జాన్వీ స్విమ్ సూట్ లో ఉన్న జాన్వీ ‘నా చెవిరింగ్ పోయింది. ఓ మై గాడ్, నా డైమండ్ చెవిపోగులు, ఏడుస్తాను’ అంటూ కిమ్ ని అనుకరించింది. ఈ వీడియో షేర్ చేసిన ఖుషీ వెర్రి నవ్వు ఈమోజీతో పాటు డైమండ్ ఎమోజీని డిస్ ప్లే చేసింది. ఈ వీడియోకి షానయ కూపర్, సంజయ్ కపూర్, మహీప్ కపూర్ ఏడుపు ఈమోజీలు పెట్టగా ఆలియా కశ్యప్ ఐకానిక్ అంటూ స్పందించారు. ఇక నెటిజన్స్ స్పందన అంతా ఇంతా కాదు. మరి మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram