Ilaiyaraaja Biopic: మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ ఆగిందా? అంటే అవుననే వినిపిస్తోంది. వెండితెరపై ఇసైజ్ఞాని ఇళయరాజా పాత్రను ధనుష్ పోషించేలా ‘కెప్టెన్ మిల్లర్’ దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ సినిమాను ఆరంభించాడు. బాలీవుడ్ కు చెందిన కనెక్ట్ మీడియా, పీకె ప్రైమ్ ప్రొడక్షన్స్, మెర్కురీ మూవీస్ సినిమాను ఆరంభించాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ను కమల్ హాసన్ ఆవిష్కరించారు. ఈ మూవీకి ఇళయరాజానే సంగీతాన్ని అందించేలా ఒప్పించారు. నీరవ్ షాను సినిమాటో గ్రాఫర్ గా ఎంపిక చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఉంటుందో లేదో అనే అయోమయ స్థితిలో ఉంది. ధనుష్ హీరోగా, డైరెక్టర్ గా బిజీ గా ఉన్నాడు. ‘ఇడ్లీకడై’ మూవీ చేస్తున్నాడు. ప్రొడక్షన్ హౌస్ కూడా అంత యాక్టీవ్ గా లేదని కోలీవుడ్ టాక్. దీంతో నిర్మాతలను మార్చి సినిమాను ముందుకు తీసుకెళ్ళాలని దర్శకుడు భావిస్తున్నాడట. ప్రాజెక్ట్ సెట్ అయితే ధనుష్ కూడా డేట్స్ ఇవ్వటానికి సిద్ధం అంటున్నాడు. ఇందులో ఇళయరాజాగా టైటిల్ రోల్ ప్లే చేయటానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్లు ఓపెనింగ్ రోజు చెప్పాడు ధనుష్. ఈ సినిమాను తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నిర్మించాలన్నది దర్శకుడి ఆకాంక్ష. మరి ఆయన కోరికను నెరవేర్చే నిర్మాత ఎవరో!
