Dulquer Salmaan: నందమూరి బాలకృష్ణ ముందు యువ హీరో దుల్కర్ సల్మాన్ తొడకొట్టేశాడు. అయితే ఇది దుల్కర్ సినిమా ‘లక్కీభాస్కర్’ ప్రచారంలో భాగంగా జరిగింది. బాలయ్య హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్’ సీజన్ 4 ఇటీవల ఆరంభం అయింది. తొలి ఎపిసోడ్ లో ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తాజాగా ఈ నెల 31న రిలీజ్ అవుతున్న ‘లక్కీ భాస్కర్’ యూనిట్ పాల్గొని సందడి చేసింది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి సందడి చేసిన ఈ షోకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఎపిసోడ్ లోనే బాలకృష్ణ తో కలసి దుల్కర్, వెంకీ అట్లూరి తొడ కొట్టారు. ఈ ఎపిసోడ్ హలేరియస్ గా ఉంటుందని యూనిట్ లోని వారు చెబుతున్న మాట. ఇక తమిళ స్టార్ సూర్య పాల్గొన్న ఎపిసోడ్ కూడా వచ్చే వారం టెలీకాస్ట్ కానుండటం విశేషం. ఈ ఎపిసోడ్ షూట్ కూడా పూర్తయింది. మొదటి మూడు సీజన్స్ ప్రేక్షకాదరణ పొంది టాక్ షోలలోనే ఇండియాలో నెంబర్ వన్ గా నిలిచిన ‘అన్ స్టాపబుల్’ సీజన్ 4 కూడా భారీ వ్యూయర్ షిప్ ని సొంతం చేసుకుంటోంది. అతి త్వరలోనే ‘పుష్ప2’ యూనిట్ కూడా ఈ షోలో సందడి చేయనుందట. మరి ఆ సందడి ఎలా ఉంటుందో చూద్దాం.

