Aadi Saikumar: టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ మరోసారి కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘శంబాల’ సినిమాతో హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న ఆది, ఈ చిత్రంలో జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నాడు. యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ నుంచి తాజాగా విడుదలైన టీజర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక గ్రామంపై ఉల్క ప్రభావం, అనూహ్య మార్పులు, వాటిని ఎదుర్కొనే ఆది పవర్‌ఫుల్ రోల్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి. “సైన్స్‌కు అందని ప్రశ్నలు, వాటికి సమాధానం దొరికితే గొప్పదనం ఏమిటి?” అనే ఆసక్తికర డైలాగ్‌తో టీజర్ ఆరంభమై, ఉత్కంఠ రేకెత్తిస్తుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ థ్రిల్లర్‌కు మరింత జోష్‌ను జోడించింది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటున్నప్పటికీ, వీఎఫ్‌ఎక్స్‌లో కాస్త మెరుగులు అవసరమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. షైనింగ్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. టీజర్‌తోనే ఈ స్థాయి ఉత్కంఠ ఉంటే, ట్రైలర్ ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

