Traffic Diversions

Traffic Diversions: బక్రీద్‌ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. అటు వైపు వెళితే ఇక అంతే

Traffic Diversions: బక్రీద్‌ (ఈద్‌ అల్‌ అద్హా) పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం (జూన్ 8) ఉదయం 11:30 గంటల వరకు నగరంలోని మీరాలం ట్యాంక్‌ బండ్‌ ఈద్గా వద్ద నిర్వహించే ప్రార్థనల నేపథ్యంలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

ప్రత్యేక ప్రార్థనల కోసం వచ్చే వాహనదారులకు మార్గాలు ఈ విధంగా నిర్ణయించారు:

  • పురానాపూల్‌, కామటిపుర, కిషన్‌బాగ్‌ నుండి మీరాలం ఈద్గా వైపు వచ్చే ప్రార్థనార్థులను బహదూర్‌పుర క్రాస్‌ రోడ్స్ ద్వారా అనుమతిస్తారు. అయితే సాధారణ వాహనాలను మన్మోహన్‌సింగ్‌ ఫ్లై ఓవర్‌ వైపు మళ్లిస్తారు.

  • శివరాంపల్లి, దానమ్మ గుడిసెల నుంచి వచ్చే ప్రార్థకులను దానమ్మహట్స్‌ క్రాస్‌ రోడ్స్ నుండి శాస్తిపురం, ఎన్‌ఎస్‌ కుంట వైపు మళ్లిస్తారు.

  • కాలాపత్తర్ నుండి ఈద్గా వైపు వచ్చేవారిని కాలాపత్తర్‌ ఎల్‌ అండ్‌ ఓ పీఎస్, మోచి కాలనీ, బహదూర్‌పుర, శంషీర్‌గంజ్, నవాబ్‌సాహెబ్‌ కుంట మార్గంలో దారిమళ్లించనున్నారు.

  • పురానాపూల్‌ నుంచి బహదూర్‌పుర వైపు వెళ్లే వాహనాలను జియాగూడ, సిటీకాలేజ్ దారిలోకి మళ్లిస్తారు.

  • శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి వంటి ప్రాంతాల నుండి బహదూర్‌పుర వైపు వచ్చే హెవీ వాహనాలను మన్మోహన్‌సింగ్‌ ఫ్లై ఓవర్ ద్వారా మళ్లిస్తారు.

పౌరులు ఈ మార్గదర్శకాలను గౌరవించి, అధికారులు సూచించిన మార్గాలనే అనుసరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. పండగ వేళ నగర ట్రాఫిక్ క్రమబద్ధంగా ఉండేందుకు అందరూ సహకరించాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Virat Kohli IPL Salary: ఐపీఎల్ లో కోహ్లీ సంపాదన ఎంత?


తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Diljit singh: ప్ర‌ముఖ సింగ‌ర్ దిల్జీత్‌సింగ్‌కు తెలంగాణ అధికారుల‌ నోటీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *