Health Tips

Health Tips: ఉదయం పూట మీలో లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే జాగ్రత్త..

Health Tips: మన మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా అవసరమైన పోషకాల సమతుల్యతను కూడా కాపాడుతాయి. కానీ కొన్నిసార్లు మన శరీరంలోని మన కిడ్నీలు మనకు తెలియకుండానే ఒత్తిడిని ఎదుర్కొంటాయి. ఈ విధమైన లక్షణాలను మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈ రకమైన నిర్లక్ష్యం భవిష్యత్తులో ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మన మూత్రపిండాల ఆరోగ్యం గురించి వీలైనంత జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. మరి మన మూత్రపిండాలు ఆరోగ్యంగా లేవని ఎలా తెలుసుకోవాలి? లక్షణాలు ఎలా ఉంటాయి..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ముఖం మీద వాపు.
మీరు ఉదయం నిద్రలేచినప్పుడు, మీ ముఖం లేదా కళ్ళ చుట్టూ వాపును గమనించవచ్చు. అంటే మీ ముఖం ఉబ్బినట్లు అనిపిస్తుంది. ఇది జరిగినప్పుడు మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా లేవని మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే మూత్రపిండాలు శరీరంలోని సోడియం, ద్రవాల సమతుల్యతను నియంత్రిస్తాయి. అవి సరిగ్గా పనిచేయనప్పుడు, కణజాలాలలో ద్రవం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది, ఇది వాపుకు దారితీస్తుంది.

మూత్రం రంగులో మార్పు
మీరు ఉదయం మూత్ర విసర్జన చేసినప్పుడు రంగు మారినట్లు లేదా దుర్వాసన వస్తుంటే, మీ మూత్రపిండాల ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు అర్ధం. సాధారణంగా, మూత్రపిండాలు వ్యర్థాలను విసర్జించడంతో పాటు అవి శరీరంలో అవసరమైన ప్రోటీన్లను కూడా గ్రహిస్తాయి. కానీ అవి సరిగ్గా పనిచేయనప్పుడు, ప్రోటీన్ బయటకు రావడం ప్రారంభమవుతుంది. ఇది ఈ సమస్యకు దారితీస్తుంది.

ఉదయం అలసిపోయినట్లు అనిపించడం.
సాధారణంగా మనం ఉదయం నిద్ర లేచినప్పుడు యాక్టివ్ గా ఉండాలి. కానీ ఉదయం నిద్ర లేచిన వెంటనే అలసిపోయినట్లు అనిపించడం మన కిడ్నీలు ఆరోగ్యంగా లేవని సూచించవచ్చు. సాధారణంగా మన మూత్రపిండాలు శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి. కానీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు, ఈ విషపదార్థాలు రక్తంలో పేరుకుపోవడం ప్రారంభిస్తాయి. ఇది అలసటకు దారితీస్తుంది.

మూత్రంలో రక్తం
సాధారణంగా మూత్ర విసర్జన చేసేటప్పుడు రక్తం కనిపిస్తే భయపడతారు. ఈ రకమైన సమస్య మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వల్ల సంభవించవచ్చు. కానీ మీరు మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు నొప్పి లేకుండా రక్తస్రావం వస్తే అది మూత్రపిండ కణ క్యాన్సర్ లేదా మూత్రాశయ క్యాన్సర్ వంటి తీవ్రమైన పరిస్థితికి సంకేతం కావచ్చు.

పొడి చర్మం, దురద
కీడ్నీలు దెబ్బతిన్నప్పుడు శరీరంలో చర్మ సమస్యలు కనిపించవచ్చు. చర్మం పొడిగా లేదా దురదగా మారవచ్చు. ఈ సమస్య ఉదయం వేళల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన మూత్రపిండాల పనితీరు బలహీనపడినప్పుడు, శరీరంలోని ఈ రెండు మూలకాల సమతుల్యత చెదిరిపోతుంది. అందువలన ఈ రకమైన సమస్య తలెత్తుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *