Etala Rajender: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కమిషన్ ఎదుట 19 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ విచారణలో ఆయన ప్రాజెక్టు నిర్మాణం, అందులోని ఆర్థిక వ్యవహారాలు, నిధుల సమీకరణ వంటి కీలక అంశాలను వివరిశారు.
ఈటెల రాజేందర్ వివరిస్తూ, ప్రాజెక్టు స్థలాన్ని తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చడాన్ని సాంకేతిక కమిటీ నివేదిక ఆధారంగా తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. సీడబ్ల్యూసీ (CWSC) నివేదిక ప్రకారం, తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడంతో, మహారాష్ట్ర కూడా అభ్యంతరం తెలిపింది. దీంతో, ప్రాజెక్టు మేడిగడ్డకు తరలించాల్సి వచ్చింది.
నిధుల కొరతను దృష్టిలో పెట్టుకొని, కాలేశ్వరం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు ఈటల వివరించారు. “కాలేశ్వరం కార్పొరేషన్ ద్వారా నిధులను సమీకరించేందుకు ప్రయత్నించాం. కానీ, కార్పొరేషన్ ద్వారా నిధుల సేకరణ జరగలేదు,” అని ఆయన చెప్పారు. ఇది ఫైనాన్స్ శాఖకు సంబంధం లేకుండా, పూర్తిగా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోనే జరిగిందని కూడా స్పష్టం చేశారు.
ఈటల పేర్కొన్న వివరాల ప్రకారం, ప్రాజెక్టు డిపిఆర్ అనుమతులను క్యాబినెట్ ఆమోదించింది. అన్ని ఆర్థిక, సాంకేతిక అంశాలపై ఆమోదాన్ని తర్వాతే అందుకున్నట్లు చెప్పారు. ప్రాజెక్టులో మూడు బ్యారేజీలు నిర్మించడానికి సంబంధించిన నిర్ణయం పూర్తిగా క్యాబినెట్ తీసుకున్నట్లు ఆయన చెప్పారు. “ఈ నిర్ణయం సాంకేతిక కమిటీ, క్యాబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు తీసుకోవడం జరిగింది,” అని ఆయన పేర్కొన్నారు.
నిధుల కేటాయింపులపై ఆర్థిక శాఖ ప్రమేయం:
కమిషన్ ప్రశ్నించినట్లుగా, నిధుల కేటాయింపు పూర్తిగా కాలేశ్వరం కార్పొరేషన్ ద్వారా మాత్రమే జరిగిందని ఈటల స్పష్టం చేశారు. “ఫైనాన్స్ శాఖకు ఈ విషయాల్లో ఏమాత్రం సంబంధం లేదు. అన్ని నిర్ణయాలు నీటిపారుదల శాఖ కిందనే వచ్చాయి,” అని ఆయన చెప్పారు.
Also Read: Telangana Congress: మల్లు రవిపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ విమర్శల బాణం
Etala Rajender: “ప్రాజెక్టు రీ డిజైన్ చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీలో హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ నేతలు ఉన్నారు,” అని ఈటల చెప్పారు. కమిషన్ “ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా?” అని ప్రశ్నించినప్పుడు, ఈటల తేలికగా “ఆర్థిక క్రమశిక్షణ లోపం లేదు. అన్ని వ్యవహారాలు నీటిపారుదల శాఖ పరిధిలోనే ఉన్నాయి,” అన్నారు.
విచారణ అనంతరం, ఈటల మీడియాతో మాట్లాడినప్పుడు, ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తన పాత్ర గురించి స్పష్టం చేశారు. “నేను ఏమీ చేయలేదు. అందరితో కలిసి, నా విధి పరమైన పనులు చేశాను. కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, టెక్నికల్ కమిటీ సమీక్షలోనే తీసుకున్నాయి,” అని ఆయన అన్నారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రాజెక్టులో జరిగిన అన్ని అంశాలు రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించబడకూడదని, ప్రాజెక్టు నష్టాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. “కేటాయింపులు, నిర్మాణం మొత్తం నీటిపారుదల శాఖలోనే జరిగాయి. ఆర్థిక శాఖకు సంబంధం లేదు,” అని ఆయన పేర్కొన్నారు.