IPL 2025 Prize Money

IPL 2025 Prize Money: ఐపీఎల్ విజేత ఆర్‌సీబీకి దక్కిన ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?

IPL 2025 Prize Money: చరిత్ర తిరగరాసిన రోజు ఇది. ఐపీఎల్ 18వ సీజన్‌లో ఎన్నో ఉత్కంఠభరితమైన పోటీలు, ఆటగాళ్ల ప్రతిభ, అభిమానుల ఊపిరి ఆడే తరహా సన్నివేశాలతో చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారిగా విజేతగా అవతరించింది. పంజాబ్ కింగ్స్‌పై కేవలం ఆరు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన ఆర్సీబీ, ఎన్నో సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికింది.

రజత్ పాటిదార్ నేతృత్వంలో ఆర్సీబీ విజయపథాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ వేడుకల్లో ఆటగాళ్లకు రివార్డుల వర్షం కురిసింది. విజేత ఆర్సీబీకి రూ.20 కోట్లు, రన్నరప్ పంజాబ్ కింగ్స్‌కు రూ.12.5 కోట్లు ప్రైజ్‌మనీగా బీసీసీఐ ప్రకటించింది. అలాగే కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్‌లకు ప్రత్యేక షీల్డ్‌లు, లిమిటెడ్ ఎడిషన్ వాచ్‌లు అందజేశారు.

ఈసారి ఐపీఎల్‌లో అత్యుత్తమ ఆటతీరు కనబరిచిన ఆటగాళ్లకు వివిధ అవార్డులు కూడా అందాయి:

ఈ సీజన్‌ అవార్డు విజేతలు

అవార్డు విజేత బహుమతి
ఆరెంజ్ క్యాప్ సాయి సుదర్శన్ (759 పరుగులు) రూ.10 లక్షలు
పర్పుల్ క్యాప్ ప్రసిద్ధ్‌ కృష్ణ (25 వికెట్లు) రూ.10 లక్షలు
ఎమర్జింగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ రూ.10 లక్షలు
మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సూర్యకుమార్‌ యాదవ్‌ రూ.15 లక్షలు
ఫెయిర్ ప్లే అవార్డు చెన్నై సూపర్ కింగ్స్ రూ.10 లక్షలు
గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది సీజన్ మహ్మద్ సిరాజ్ రూ.10 లక్షలు
క్యాచ్ ఆఫ్ ది సీజన్ కమిండు మెండిస్ రూ.10 లక్షలు
ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్ సాయి సుదర్శన్ రూ.10 లక్షలు
సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ నికోలస్ పూర్ రూ.10 లక్షలు
సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది సీజన్ వైభవ్ సూర్యవంశి టాటా కర్వ్ కారు

ఫైనల్ మ్యాచ్ స్పెషల్ అవార్డులు

ఆటగాడు అవార్డు బహుమతి
కృనాల్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రూ.5 లక్షలు
శశాంక్ సింగ్ ఫాంటసీ కింగ్, సూపర్ సిక్సర్ రూ.2 లక్షలు
జితేశ్ శర్మ సూపర్ స్ట్రయికర్ రూ.1 లక్ష
ప్రియాన్ష్ ఆర్యా మోస్ట్ ఫోర్లు రూ.1 లక్ష
కృనాల్ పాండ్యా గ్రీన్ డాట్ బాల్స్ రూ.1 లక్ష
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ALSO READ  Chahal Dhanashree: అంతా తల్లి కోసమే... యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడాకులకు అసలు కారణం ఇదే

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *