Relationship Tips: మన పురాణాల ప్రకారం భార్యభర్తలు కొన్ని సమయాల్లో శృంగారంలో పాల్గొనకూడదు. అలా చెప్పడం వెనక కొన్ని నిర్దిష్ట నియమాలు ఉన్నాయి. ఈ సమయాల్లో కలిస్తే దంపతులతో పాటు పుట్టబోయే పిల్లలకు కూడా మంచిది కాదని చెబుతారు. దీన్ని ఇప్పటికీ చాలా మంది పాటిస్తారు. మరి ఏ ఏ సమయాల్లో జంటలు సెక్స్ లో పాల్గొనకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
భాగవత పురాణంలో చెప్పినట్లుగా.. బ్రహ్మ ముహూర్త సమయంలో ఉదయం శృంగారంలో పాల్గొనకూడదు. ఎందుకంటే అది దేవతలు ప్రయాణించే సమయం. దేవతలు పూజించే సమయం. అందువల్ల ఈ సమయంలో జంటలు సెక్స్ చేయడం లేదా వివాహం చేసుకోవడం మంచిది కాదని అంటారు.
భార్యభర్తలు సాయంత్రం కూడా కలవకూడదు. ఎందుకంటే ఈ సమయంలో కలిస్తే వారికి చెడు లక్షణాలు కలిగిన పిల్లలు పుడతారని ఒక నమ్మకం ఉంది. కాబట్టి సంధ్యా సమయంలో కలవొద్దు.
ఇది కూడా చదవండి: Smallest Country: ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఇదే
వరమహాలక్ష్మి వ్రతం, సత్యనారాయణ పూజ, గణపతి పూజ వంటి వ్రత సమయంలో, ఆ రోజు లేదా రాత్రి ఏ కారణం చేతనైనా జంట సెక్స్ లో పాల్గొనవద్దు. ఇంట్లో పెద్దలు కూడా ఇదే విషయాన్ని చెబుతారు.ః
గ్రహణం సమయంలో.. అంటే సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో జంటలు ఎట్టి పరిస్థితుల్లోనూ శృంగారంలో పాల్గొనద్దు.
స్త్రీలు తమ రుతుక్రమం ముగిసే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ శృంగారంలో పాల్గొనకూడదు. సాధారణంగా ఆ ఐదు రోజులు భార్యాభర్తలు కలిసి ఉండటం మంచిది కాదు. ఈ సమయంలో ఆడవారు వీలైనంత ఎక్కువ పరిశుభ్రతను పాటించడానికి ప్రయత్నించాలి.