Etala rajendar: తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంటున్న నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టు లో అవకతవకలపై విచారణ చేపట్టిన కమిషన్‌కు తాను తప్పకుండా హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు. ‘‘నాతో సంబంధం ఉన్న అంశాల్లో నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నిజాయితీగా పని చేసినవారికి భయపడాల్సిన అవసరం లేదు’’ అంటూ చెప్పారు.
అలాగే, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావును తాను కలవలేదని, ఈ విషయంలో అవాస్తవ ప్రచారాలు చేస్తున్నవారిపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్, కాంగ్రెస్పా ర్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
‘‘బీఆర్‌ఎస్ నేతలు మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారు. ఎవరో ఇచ్చారు కాబట్టి తెలంగాణ ఏర్పడినట్లు కాదు. ఈ రాష్ట్రం లక్షల మంది ప్రజల ప్రాణత్యాగాలతో వచ్చింది. కానీ గత పాలనలో తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బందీ అయిపోయింది.’’ అని అన్నారు.
అలాగే, కాంగ్రెస్ పార్టీ పాలనపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘‘ఏడాదిన్నరుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు గౌరవం ఇవ్వలేదు. ఉద్యమకారులను గుర్తించలేదు. తెలంగాణ ప్రజల ఆశలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు నిర్వీర్యం చేశాయయని అన్నారు l.

