NTR-Prashanth Neel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం గురించి సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది. జూన్ మూడో వారం నుంచి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో కీలక సన్నివేశాల షూటింగ్ షురూ కానుంది. ఈ సెట్‌లో హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారు, ఇది సినిమాకే హైలైట్‌గా నిలవనుందట.
Also Read: Suriya: సూర్య – వెంకీ అట్లూరి సినిమా జోరు.. 100 మందితో యాక్షన్ సీక్వెన్స్
NTR-Prashanth Neel: ఎన్టీఆర్‌తో పాటు ప్రకాష్ రాజ్, ఇతర కీలక నటీనటులు ఈ సన్నివేశాల్లో కనిపించనున్నారు. ‘డ్రాగన్’గా పిలువబడుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఐకానిక్‌గా మార్చేందుకు ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్‌పై ఏళ్ల తరబడి కసరత్తు చేశారట. రవి బస్రూర్ సంగీతంతో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, ప్రశాంత్ నీల్ ఫిల్మోగ్రఫీలోనే బెస్ట్‌గా నిలిచే అవకాశం ఉందని టాక్. అభిమానుల్లో హైప్ పీక్స్‌లో ఉంది.