బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ అంటే ఫ్యాన్స్ కి పిచ్చి క్రేజ్. తన అందం, నటన, డ్రెస్సింగ్ తో విలక్షణ పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది ఈ అమ్మడు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో తనకు కలిగిన అనుభవాలను గుర్తుచేసుకుంది విద్యాబాలన్. దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత ఆమెను ఘోరంగా అవమానించారట.
‘హీరోయిన్ గా నేను సెలక్ట్ అయిన మలయాళ మూవీ చక్రం. మోహన్ లాల్ హీరో అనగానే ఎంతో ఆనందం కలిగింది. వేరే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. వాటన్నింటికీ సైన్ చేశానని.. కానీ ఏమైందో ఏమో తెలియదు. చక్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ విషయం తెలిసిన వారంతా విద్యాబాలన్ జాతకం మంచిది కాదని మిగిలిన సినిమాల నుంచి కూడా నన్ను తొలగించారు. కొంతకాలానికి ఓ తమిళ మూవీలో ఆఫర్ వచ్చింది. అయితే చక్రం మూవీ ఆగిపోయిన విషయం తెలిసి అతను కూడా నన్ను ఆ సినిమా నుంచి తీసేశాడు. మా తల్లిదండ్రులను తీసుకుని ఆ నిర్మాతను ప్రశ్నించేందుకు వెళ్లాను. ఆ నిర్మాత నా ఫోటోలను చూపించి యాక్టింగ్ రాదు, డ్యాన్స్ రాదు, హీరోయిన్ కళ లేదు. మాకెందుకు ఈ తలనొప్పి అన్నాడు. దాంతో ఆర్నెల్ల వరకు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేక పోయాను. మానసికంగా కుగింపోయాను. నాపై నాకే అసహ్యం వేసింది. ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను’ అని చెప్పుకొచ్చింది.