Carlos Sainz: ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ ఈ సీజన్ లో తొలి పోల్ పొజిషన్ సాధించాడు. మెక్సికో గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ టోర్నీలో సెయింజ్ అగ్రస్థానంలో నిలిచాడు. క్వాలిఫయింగ్ సెషన్‌లో సెయింజ్ ల్యాప్‌ను అందరికంటే వేగంగా 1 నిమిషం 15.946 సెకన్లలో పూర్తి చేశాడు. మెక్సికో గ్రాండ్‌ప్రిలో ఐదుసార్లు విజేతగా నిలిచిన రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. మెక్‌లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ మూడో స్థానంలో నిలిచాడు. గత వారం యూఎస్ గ్రాండ్ ప్రి నెగ్గిన ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ నాలుగో స్థానంతో క్వాలిఫయింగ్ రౌండ్‌ను ముగించాడు.
