Bihar: ఆర్జేడీ (RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి 4 సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ఆయన ప్రవర్తన కారణంగా తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల, తేజ్ ప్రతాప్ ఓ యువతితో బహిరంగంగా రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పార్టీ మరియు కుటుంబ గౌరవం దెబ్బతిన్నట్లు లాలూ పేర్కొన్నారు.
లాలూ ప్రకారం, తేజ్ ప్రతాప్ ప్రవర్తన కుటుంబ విలువలకు విరుద్ధంగా ఉందని, అందరికీ చెడ్డపేరు తెచ్చేలా ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో, తేజ్ ప్రతాప్‌ను పార్టీ నుంచి మాత్రమే కాకుండా, కుటుంబం నుంచి కూడా బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై తేజ్ ప్రతాప్ స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా తన సోషల్ మీడియా ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని, తన కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు.