SSMB 30: సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 రిలీజ్ తర్వాత ఆయన స్టార్‌డమ్ హాలీవుడ్ రేంజ్‌కు చేరనుంది. దీంతో ఎస్ఎస్ఎంబీ 30పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఇద్దరు దర్శకుల పేర్లు హాట్ టాపిక్‌గా మారాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన సుకుమార్ మళ్లీ మహేష్‌తో జతకట్టే అవకాశం ఉందని టాక్. గతంలో వన్ నేనొక్కడినే సినిమాతో మహేష్‌కు హిట్ ఇవ్వలేకపోయిన సుకుమార్, ఈసారి ఆ అవకాశాన్ని జారవిడవడని తెలుస్తోంది. మరోవైపు, సందీప్ రెడ్డి వంగ కూడా మహేష్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్, రణబీర్ కపూర్‌తో యానిమల్ పార్క్ చేస్తున్న సందీప్, ఆ తర్వాత మహేష్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఈ ఇద్దరు దర్శకుల సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించాయి. కాబట్టి, ఎవరు డైరెక్ట్ చేసినా మహేష్ ఫ్యాన్స్ సంతోషంగానే ఉంటారు. మరి సూపర్ స్టార్ ముందుగా ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి.
