Covid-19: దేశవ్యాప్తంగా కోవిడ్-19 మళ్లీ తన అడుగులు వేసుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో మొదటి పాజిటివ్ కేసు నమోదై ప్రజల్లో ఆందోళన కలిగించింది. విశాఖపట్నం మద్దిలపాలెంకు చెందిన 28 ఏళ్ల వివాహితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
Covid-19: ఆ మహిళకు గత కొన్ని రోజులుగా జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపించగా, విజయ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్‌లో పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. వెంటనే వైద్యులు ఆమె భర్త, పిల్లలపై పరీక్షలు నిర్వహించగా, వారికి నెగటివ్ వచ్చింది. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉండగా, హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.
Covid-19: ఈ కేసు వెలుగులోకి రావడంతో జిల్లా ఆరోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. మహిళ నివాసం ఉన్న పిఠాపురం కాలనీలో మూడు ప్రత్యేక టీమ్‌లు ఇంటింటికీ సర్వేలు ప్రారంభించాయి. ముందస్తు జాగ్రత్తగా 70 ఇళ్ల పరిధిలో 200 మందికి పైగా పరీక్షలు నిర్వహించారు.
Covid-19: అధికారుల ప్రకారం, బాధితురాలు ఎక్కడికీ ప్రయాణించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయినప్పటికీ కమ్యూనిటీ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానికంగా శానిటేషన్ చర్యలు ముమ్మరం చేశారు. అవసరమైన పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు నిల్వలో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
Covid-19: వైద్యారోగ్య శాఖ ప్రకారం, కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. జ్వరం, దగ్గు, నీరసం, రుచి లేదా వాసన కోల్పోవడం, గొంతునొప్పి వంటి లక్షణాలుంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి.
- మాస్క్ ధరిస్తూ,
- శానిటైజర్ వాడకాన్ని అలవాటుగా మార్చుకుంటూ,
- సామాజిక దూరం పాటిస్తూ,
- అనవసరంగా గుంపులుగా చేరకుండా ఉండాలి.
Covid-19: ప్రత్యేకించి వృద్ధులు, గర్భిణులు, పిల్లలు బయటకు వెళ్లకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రార్థనా సభలు, పార్టీల వంటి సామూహిక సమావేశాల్లో పాల్గొనేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Covid-19: గతంలో కోవిడ్ ప్రభావం మన జీవితాలను తీవ్రంగా తాకిన సంగతి మరువకూడదు. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులు ఎదురవకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే, కోవిడ్‌పై విజయం సాధించవచ్చు.
Covid-19: కరోనా మళ్లీ తలెత్తుతున్న వేళ… మన ఆరోగ్యమే మన సంపద. చిన్న లక్షణాలను తక్కువ అంచనా వేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. కోవిడ్ నిబంధనలు పాటించడం ఒక్కో వ్యక్తి బాధ్యత. అప్రమత్తంగా ఉంటేనే… మనం, మన కుటుంబం, సమాజం సురక్షితంగా ఉంటుంది.

