Kumki Elephants Entry: ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల బెడద నుంచి పంటలను, ప్రజలను కాపాడేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన నిర్ణయం ఫలించింది. కర్ణాటక ప్రభుత్వం ఆరు కుంకీ ఏనుగులను ఏపీకి అప్పగించింది. బెంగళూరు విధానసౌధలో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమక్షంలో పవన్ కళ్యాణ్ ఈ ఏనుగుల సంరక్షణ డాక్యుమెంట్లను స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్, కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ, కర్ణాటక మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. కుంకీ ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.
గతంలో ఏ పాలకులు ఆలోచించని విధంగా… పవన్ తీసుకున్న నిర్ణయం, సాధించిన ఈ చిన్ని విజయం.. పార్వతీపురం మన్యం వంటి ఏజెన్సీ జిల్లాల్లో ఏనుగులు సృష్టిస్తున్న సమస్యలకు చెక్ పెడుతూ.. పంట పొలాలు నాశనమవుతూ బాధలు పడుతున్న రైతాంగం జీవితాల్లో పెద్ద మార్పుకు సోపానంగా నిలుస్తోంది. కుంకీ ఏనుగులు శిక్షణ పొందిన మగ ఏనుగులు. ఇవి అడవి ఏనుగులను తరిమికొట్టడంలో, వాటి భారి నుండి సమీపంలోని పంట పొలాలను, గ్రామాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కుంకీ ఏనుగుల పహారాలో ఇకపై పంటలు సురక్షితంగా ఉంటాయి. ఏనుగుల గుంపు దాడి.. పంట పొలాలు విధ్వంసం, ఏనుగుల గుంపు దాడిలో వ్యక్తి మృతి… ఇలాంటి వార్తలు ఇకపై కనిపించవు. ఎందుకంటే.. ఈ కుంకీ ఏనుగులు కనిపిస్తే చాలు.. ఏనుగుల గుంపులు అడవిలోకి దౌడు తీయాల్సిందే. ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా… ఈ కుంకీ ఏనుగుల రాక… ఏపీలో అటవీ శాఖకు కొత్త శోభనిస్తోంది అంటున్నారు అటవీ అధికారులు.
Also Read: PM Modi: 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
Kumki Elephants Entry: మరోవైపు, పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా, జనసేన అధ్యక్షుడిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు చేరువయ్యేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుతో అధికారంలోకి వచ్చిన జనసేన, పవన్ నాయకత్వంలో క్రమంగా బలోపేతం అవుతోంది. అయినప్పటికీ.. డిప్యూటీ సీఎంగా, ఐదు శాఖలకు మంత్రిగా పాలనలో తలమునకలవడం ఎంతో సంతోషించదగ్గ విషయమే కానీ.. పాలన వ్యవహారాలు, ప్రజా కార్యక్రమాల్లో మునిగి… జనసేనాని పార్టీకి టైమ్ కేటాయించడం లేదని… పార్టీ విస్తరణ, అభివృద్ధి మీద కూడా పవన్ దృష్టి కేంద్రీకరించాలని జనసేన నేతలు, జనసైనికుల నుండి వినతులు వస్తున్న నేపథ్యంలో.. వాటన్నింటికీ సమాధానంగా… ప్రజలకు మరింత చేరువయ్యేలా, పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా, దృడ నిశ్చయంతో.. ”మన ఊరి కోసం మాటా మంతీ” అనే కొత్త కార్యక్రమాన్ని అత్యంత వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ చేపట్టారని తెలుస్తోంది.
మన ఊరి కోసం మాటామంతీ…! ఇందులో భాగంగా వర్చువల్ సమావేశాల ద్వారా, ప్రతి రోజూ ఒక గ్రామ ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారాలు చూపేందుకు పవన్ సిద్ధమయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయం నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామంతో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి, ప్రజలతో పవన్ ముఖాముఖీ మాట్లాడతారు. అంటే ఇలా కూడా.. ఇక ముందు పవన్ స్క్రీన్‌పై సందడి చేయనున్నారనమాట. సినీ నటుడిగా స్టార్ ఇమేజ్ ఉన్న పవన్… రాజకీయ నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లడం సమస్యగా పరిణమించింది. దీంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పవన్. ఈ వ్యూహం జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాక, కార్యకర్తల్లో జోష్ పెంచి, పార్టీని బలోపేతం చేసే దిశగా దోహదపడుతుందని భావిస్తున్నారు.