M. J. Akbar: ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాల ముందు స్పష్టంగా వివరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు వివిధ దేశాలకు వెళ్లి, పాక్ నుంచి వచ్చే ఉగ్రవాద ముప్పును వాస్తవ ఆధారాలతో వివరిస్తాయి. ఇది “ప్రజా దౌత్యం”కు చాలా గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.
ఈ కార్యక్రమాన్ని “ఆపరేషన్ సింధూర్”గా పిలుస్తున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటైన 7 ప్రతినిధి బృందాలు 25 దేశాలకు వెళ్లనున్నాయి. వీటిలో 15 దేశాలు భద్రతా మండలి (UNSC) సభ్యులు కాగా, 5 దేశాలు త్వరలో సభ్యులవుతాయి. మరో 5 ప్రభావవంతమైన దేశాలకూ బృందాలు వెళ్లనున్నాయి. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపిన వివరాల ప్రకారం, ఇది భారత్ చేపట్టిన వినూత్న ప్రజా దౌత్యం ప్రయత్నాల్లో ముఖ్యమైనదిగా భావించవచ్చు.
ఇది కూడా చదవండి: Promotion for Lokesh: ‘మహానాడు’ సంచలనాలు.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
ఈ అంశంపై మాజీ కేంద్ర మంత్రి ఎంజె అక్బర్ మాట్లాడుతూ, ఇది ఒక సాంకేతికంగా మంచి వ్యూహమని తెలిపారు. గతంలో ప్రభుత్వం స్థాయిలో పాకిస్తాన్‌పై ప్రతిస్పందనలు ఇచ్చినా, ఈసారి నేరుగా ప్రపంచ ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. “మేము కల్పితాలు కాదు, వాస్తవాలను చెబుతున్నాం. మోడీ గారి లక్ష్యం శాంతిని పొందడం, కానీ పాకిస్తాన్‌కు అసలే శాంతి అర్థం కాదు” అని వ్యాఖ్యానించారు.
మొత్తానికి, భారత్ ఈసారి ఉగ్రవాదాన్ని ఎదిరించడంలో కొత్త దారులు తీసుకుంటోంది. రాజకీయ నాయకులతో మాత్రమే కాకుండా, ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు భారత్ తీసుకుంటున్న ఈ దౌత్యపూరిత దిశ అంతర్జాతీయంగా మంచి ప్రభావం చూపించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవాలపై ఆధారపడే ఈ ప్రచారం, పాక్ మద్దతుతో సాగుతున్న ఉగ్రవాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప అవకాశం కానుంది.
VIDEO | On Pakistan sending diplomatic delegation abroad, former Union Minister MJ Akbar says, “The trouble with Pakistan’s delegation will be that they will find it very hard to understand the meaning of their mission, if they say the mission is peace- they have never been at… pic.twitter.com/6ej6SmgNq2
— Press Trust of India (@PTI_News) May 20, 2025