YCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2024 సాధారణ ఎన్నికల సందర్భంగా వైసీపీ తీసుకున్న రాజకీయ నిర్ణయాలపై ఆయన ఆత్మవిమర్శ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘2024 ఎన్నికల్లో మేం తప్పు చేశాం. అప్పట్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదే. గత ఐదేళ్లుగా పార్లమెంట్‌లో ఎన్డీఏ తీసుకొచ్చిన ప్రతీ బిల్లుకు మద్దతు ఇచ్చాం. ప్రధాని మోదీ ఏం చెప్పారో అదే చేశాం. అయినా చివరికి బీజేపీతో విభేదించి దూరమయ్యాం. ఆ నిర్ణయం వల్ల మేమే నష్టపోయాం’’ అని ప్రసన్నకుమార్ వెల్లడించారు.
తాను వ్యక్తిగతంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని అభిప్రాయపడుతున్నట్టు తెలిపారు. అయితే, తుది నిర్ణయం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిదేనని స్పష్టంచేశారు.
ఈ వ్యాఖ్యలు వైసీపీ రాజకీయ ధోరణిలో మార్పుకు సంకేతంగా భావించవచ్చా? లేక ఇది కేవలం ఓ మాజీ నేత వ్యక్తిగత అభిప్రాయమేగా? అన్న చర్చలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి.