Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ స్పానిష్ మూవీ ‘ఛాంపియన్స్’ రీమేక్‌గా రూపొందుతోంది. ఆర్ ఎస్ ప్రసన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చినప్పటికీ, నార్త్ ఆడియెన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Also Read: SSMB29లో విలన్‌గా ‘గ్లాడియేటర్’ స్టార్?
Aamir Khan: ఇటీవలి పహాల్గమ్ దాడి, ఆపరేషన్ సిందూర్ వంటి సంఘటనలపై బాలీవుడ్ స్టార్స్ నిశ్శబ్దం పట్ల నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమీర్ ఖాన్ రిలీజ్ సమయంలో స్పందిస్తే నమ్మేవారు ఉండరని, సినిమాపై బాయ్‌కాట్ ఎఫెక్ట్ పడుతుందని కామెంట్స్ వస్తున్నాయి. రీసెంట్ ఫ్లాప్‌ల తర్వాత అమీర్‌కు ఈ సినిమా కీలకం కాగా, నార్త్ ఆడియెన్స్ రియాక్షన్ ఫలితంపై ప్రభావం చూపనుంది. ఈ వివాదం సినిమా విజయాన్ని ఎలా దెబ్బతీస్తుందో చూడాలి!