ISIS Sleeper Cells Arrested: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఐసిస్ స్లీపర్ సెల్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు శనివారం అరెస్టయ్యారు. జకార్తా నుండి భారత్‌కు వచ్చిన ఈ ఇద్దరిని టెర్మినల్ 2 వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపిన తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకుంది.
అరెస్టయిన వారు అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్‌వాలా, మరియు తల్హా ఖాన్. వీరిద్దరూ 2023లో పూణేలో జరిగిన IED బాంబు తయారీ కేసులో నిందితులుగా ఉన్నారు. అప్పటినుంచి పరారీలో ఉన్న వీరిపై ముంబై ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వీరి కోసం NIA రూ.3 లక్షల బహుమతిని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇస్లామిక్ పాలనకు కుట్ర – భారతదేశంపై యుద్ధం లక్ష్యంగా
NIA ప్రకారం, ఈ ఐసిస్ ఉగ్రవాదులు భారతదేశాన్ని ఇస్లామిక్ పాలన కలిగిన దేశంగా మార్చాలన్న ఉద్దేశంతో పథకాలు రచించారు. దేశ భద్రతను దెబ్బతీయడం, మత సామరస్యాన్ని చెడగొట్టడం, శాంతిని నాశనం చేయడం ఈ కుట్రల వెనక ఉన్న ప్రధాన లక్ష్యాలు.
ఇది కూడా చదవండి: Congress Party: సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో భగ్గుమన్న కాంగ్రెస్ వర్గపోరు.. పోలీసుల లాఠీచార్జి.. ఇద్దరికి గాయాలు
వీరు పూణేలో బాంబు తయారీ, శిక్షణ వర్క్‌షాపులు నిర్వహించారని, ఆ సమయంలో చేసిన IED పరీక్ష పేలుళ్లకు ఇదే కారణమని NIA స్పష్టం చేసింది.
ఇతర ఎనిమిది మంది ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో
ఈ కేసులో ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ పూణే స్లీపర్ సెల్‌కు చెందిన మరో 8 మంది – మహ్మద్ ఇమ్రాన్ ఖాన్, మహ్మద్ యూనస్ సాకీ, అబ్దుల్ ఖాదిర్ పఠాన్, సిమాబ్ ఖాజీ, జుల్ఫికర్ బరోదావాలా, షామిల్, అకీఫ్, షానవాజ్ ఆలంలను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు.
ముంబై ఎయిర్‌పోర్ట్, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు
ఈ అరెస్టుల నడుమే ముంబై ఎయిర్‌పోర్ట్, తాజ్ హోటల్‌కు బాంబు పేలుళ్లు జరిపేలా బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ బాంబు బెదిరింపులను కూడా ఎన్ఐఏ సీరియస్‌గా తీసుకుని విచారణ కొనసాగిస్తోంది.