JYAS

JYAS: జగదేక వీరుడు అతిలోక సుందరికి సాలిడ్ రెస్పాన్స్.. విశ్వంభరపై అంచనాలు!

JYAS: మెగాస్టార్ చిరంజీవికి ఫాంటసీ జానర్‌తో అత్యంత ప్రత్యేక బంధం ఉంది. జగదేక వీరుడు అతిలోక సుందరితో తెలుగు సినిమాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన చిరు, అంజి సినిమాతో ఈ జానర్‌లో తనదైన ముద్ర వేశారు. ఈ సినిమాలు తెలుగు ఆడియెన్స్‌లో క్రేజీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాయి. ఇటీవల జగదేక వీరుడు రీ-రిలీజ్‌కు థియేటర్లలో సాలిడ్ రెస్పాన్స్ రావడం విశేషం. ఈ హిట్‌తో మెగాస్టార్ నుంచి రాబోతున్న ఫాంటసీ చిత్రం విశ్వంభరపై హైప్ మళ్లీ పీక్స్‌కు చేరింది.విశ్వంభర టీజర్ గ్లింప్స్‌పై కొన్ని మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, చిరంజీవి ఫాంటసీ జానర్‌లో సరైన కథతో వస్తే ఆ సినిమాను ఆపడం అసాధ్యం. దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సరైన వర్కౌట్ అయితే విశ్వంభర మెగా ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ఆడియెన్స్‌ను ఊపేసే అవకాశం ఉంది. మరి ఈ ఫాంటసీ జానర్‌లో చిరు మరోసారి బాక్సాఫీస్ షేక్ చేస్తారా? వేచి చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Narendra Modi: అతను కుర్రాడు కాదు.. చిచ్చర పిడుగు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *