IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలను నిరవదికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ధర్మశాలలో గురువారం పంజాబ్-ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. జమ్మూకశ్మీర్ లోని పఠాన్‌కోట్‌లో పాకిస్తాన్ డ్రోన్, వైమానిక దాడుల నేపథ్యంలో ఆ మ్యాచ్ రద్దయింది.
IPL 2025: ఆ తర్వాత క్రికెటర్లతోపాటు సిబ్బంది, బ్రాడ్ క్యాస్టింగ్ సిబ్బందిని బీసీసీఐ ప్రత్యేక రైలులో తరలించింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న దృష్ట్యా ఈ సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌లను జరపడం ఏమాత్రం మంచిదికాదని భావిస్తున్నట్టు బీసీసీఐ అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే లీగ్‌ను నిరవదికంగా వాయిదా వేసినట్టు తెలిపారు.