Simbu: తమిళ స్టార్ హీరో శింబు మరోసారి దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో చేతులు కలిపారు. తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం, శింబు తన 51వ సినిమాను మణిరత్నం దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు ముందు శింబు ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో చేరనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మణిరత్నం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ‘థగ్ లైఫ్’ తర్వాత వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ‘STR 51’గా టెంపరరీ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్ ‘థగ్ లైఫ్’ పూర్తయిన వెంటనే మొదలవుతుందని తెలుస్తోంది. మణిరత్నం మార్క్ ఎమోషనల్ డ్రామాతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ‘థగ్ లైఫ్’లో శింబు పనితీరును మణిరత్నం ప్రశంసించారు. ఈ కాంబినేషన్ మరోసారి అద్భుతమైన సినిమాను అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. శింబు, మణిరత్నం ఫ్యాన్స్ ఈ అప్డేట్తో ఫుల్ ఖుషీలో ఉన్నారు.

