Hyderabad: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్కు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గౌరవం దక్కింది. డ్రగ్స్ నిర్మూలనలో ఆయన చూపిన కృషికి గుర్తింపుగా “ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్” అవార్డును అందుకుంటున్నారు. ఈ అవార్డు ప్రపంచవ్యాప్తంగా 138 దేశాల నుంచి పోటీ పడ్డ అధికారుల్లో ఎంపికైన వారికే లభిస్తుంది.
డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగంపై హైదరాబాద్లో కఠిన చర్యలు తీసుకుంటూ, యాంటీ నార్కొటిక్స్ చర్యలకు నాయకత్వం వహించినందుకు ఈ గౌరవం లభించనుంది. సీవీ ఆనంద్ నేతృత్వంలో హైదరాబాద్ పోలీస్ విభాగం, యువతను మత్తు పదార్థాల బారినుంచి కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్కూల్స్, కాలేజీల వద్ద సడన్ రెయిడ్లు, మత్తుపదార్థాల సరఫరాదారులపై కేసులు నమోదు, అవగాహన కార్యక్రమాలు వంటి అంశాల్లో ముందంజలో ఉంది.
ఈ అవార్డు దుబాయ్లో జరగబోయే అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్లో ప్రదానం చేయనున్నారు. ఈ ఘనత తెలంగాణ పోలీస్ శాఖకే కాదు, భారతదేశానికే గర్వకారణం.