Balakrishna: హిందూపురంలో నందమూరి బాలకృష్ణకు ఘన సన్మానం! పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలయ్య మనసు తెరిచి మాట్లాడారు. “హిందూపురం నా రెండో ఇల్లు, ఇది నందమూరిపురం. ఇక్కడ సన్మానం చేయడం ఆనందంగా ఉంది. పద్మభూషణ్ సరైన సమయంలోనే వచ్చింది” అని బాలయ్య అన్నారు.
తండ్రి ఎన్టీఆర్ శతజయంతి, మూడోసారి ఎమ్మెల్యేగా విజయం, వరుసగా నాలుగు సినిమా హిట్లు, హీరోగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ అవార్డు రావడం సంతోషమని చెప్పారు. “50 ఏళ్లు కథానాయకుడిగా కొనసాగిన వ్యక్తి ప్రపంచంలో మరొకరు లేరు. తెలుగు జాతి నాకు ఈ శక్తినిచ్చింది” అని కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. షుటింగ్‌కి హాజరైన పవన్ కళ్యాణ్
Balakrishna: బాలయ్య స్టైల్లో చమక్కు మాటలు కూడా వదిలారు. “‘బాలకృష్ణకు అంత పొగరు ఎందుకు?’ అని అంటారు. నన్ను చూసుకునే నాకు పొగరు!” అని నవ్వులు పూయించారు. ఈ కార్యక్రమానికి కారకులైన వారందరికీ బాలయ్య ధన్యవాదాలు తెలిపారు.

