IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సత్తా చాటింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో జరిగిన కీలక పోరులో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారీగా 213 పరుగులు నమోదు చేసింది.
ఈ ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 62 పరుగులతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు చివర్లో షెపర్డ్ చేతుల్లో మిగిలిన బౌలర్లపై విరుచుకుపడి, కేవలం 14 బంతుల్లో 53 పరుగులు చేయడం గమనార్హం. ఈ మ్యాచులో షెపర్డ్ హిట్టింగ్తో స్కోరు బోర్డు వేగంగా మారిపోయింది.
కోహ్లీ ఇన్నింగ్స్‌కు శాంతమైన ప్రారంభం ఇచ్చినప్పటికీ, షెపర్డ్ వచ్చిన తర్వాత మ్యాచ్ మోమెంటం పూర్తిగా RCBవైపే మళ్లింది.
ఈ భారీ స్కోరును ఛేదించాలంటే CSKకు ప్రతి ఓవర్‌కి భారీగా పరుగులు అవసరం. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ముందు 214 పరుగుల టార్గెట్ ఉన్నది, ఇది ఒక గట్టి సవాలే.

