Hit-3 : నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హిట్ 3’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డే 1 నుంచే రికార్డు ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తూ నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యూఎస్ మార్కెట్‌లో నాని క్రేజ్ మరోసారి రుజువైంది. కేవలం రెండు రోజుల్లోనే 1.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌తో సంచలనం సృష్టించిన ఈ సినిమా, వీకెండ్ నాటికి 2 మిలియన్ మార్క్‌ను సునాయాసంగా దాటేసేలా ఉంది.
Also Read: Sumanth-Keerthi Reddy: మళ్ళీ పెళ్లి.. సుమంత్-కీర్తి రెడ్డి మళ్లీ ఒక్కటవుతున్నారా?
Hit-3: అర్జున్ సర్కార్ పాత్రలో నాని మాస్ హవా, శైలేష్ కొలను డైరెక్షన్, శ్రీనిధి శెట్టి గ్లామర్ కలిసి ‘హిట్ 3’ను అభిమానులకు ఓ వైలెన్స్ ఫీస్ట్‌గా మార్చాయి. యూఎస్‌లో ఈ సినిమా వసూళ్లు తెలుగు స్టార్స్ రికార్డులను సైతం సవాల్ చేసే స్థాయికి చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా, ‘హిట్ 3’ మాస్ సునామి ఇప్పుడు ఆగేలా లేదు!

