Ponguleti srinivas: రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా చేసిన చిట్‌చాట్‌లో పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ, అప్పట్లో మంత్రులకు ఏ మాత్రం అధికారాలు ఉండేవి కావని, పని చేయడానికి అవకాశమే ఇవ్వలేదని చెప్పారు.
రెవెన్యూ వ్యవస్థపై విమర్శలు
పొంగులేటి మాట్లాడుతూ, “కేసీఆర్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మంత్రులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. నూతన ప్రభుత్వం దీనికి చరమగీతం పలికే దిశగా కృషి చేస్తోంది” అని స్పష్టం చేశారు.
భూభారతిలో కొత్త సాఫ్ట్వేర్
భూభారతి పద్ధతిలో నూతన సాంకేతికతను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే కొత్త సాఫ్ట్వేర్ ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి లేకుండా చూస్తాం
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌లో అవినీతి జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అవినీతి జరిగేందుకు అవకాశం ఇవ్వబోమని మంత్రి హామీ ఇచ్చారు.
సర్వేయర్ల నియామకం త్వరలో
సర్వేయర్ల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో వెలువడనుందని తెలిపారు. ఇప్పటికే 6 వేల దరఖాస్తులు అందాయని, వీటిని పరిశీలించి అవసరమైన నియామకాలు చేపడతామని చెప్పారు.
పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా సర్వే మ్యాప్
జూన్‌లో పైలెట్ ప్రాజెక్ట్ రూపంలో భూముల సర్వే మ్యాపింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా ఈ పద్ధతిలో చేపడతామని వివరించారు.
ప్రైవేట్ సర్వేయర్లతో భూముల సర్వే
ప్రైవేట్ సర్వేయర్లతో పాటు ప్రభుత్వ పర్యవేక్షణలో భూముల సర్వే జరగనుందని, పారదర్శకతకు అధిక ప్రాధాన్యతనిస్తామని మంత్రి వెల్లడించారు.

