cm chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అమరావతిలో కీలక ప్రకటనలు చేశారు. మూడు సంవత్సరాల్లో అమరావతిని పూర్తిగా నిర్మించి, మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామన్నారు. మొత్తం రూ.57,980 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగడం జరిగింది.
“మోదీ గారి మార్గదర్శకత్వంలో అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తయారు చేస్తాం. ఇది ఐదు కోట్ల మంది ప్రజల ఆశయాల ప్రతిరూపం. అమరావతిలోనే భవిష్యత్‌లో ఐదు లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసించేలా చేస్తాం,” అని సీఎం పేర్కొన్నారు.
అమరావతిని విద్యా మరియు ఆరోగ్య రంగాలలో హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో బిట్స్ పిలానీ, టాటా ఇన్నోవేషన్ హబ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. రాజధాని నిర్మాణం పర్యావరణహితంగా, ఆధునిక ప్రమాణాలతో ఉంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రజల అండతో కేంద్రం తీసుకున్న **కులగణన నిర్ణయానికి** స్వాగతం తెలిపారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేసి 94 శాతం విజయశాతం సాధించామన్నారు. “ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ఆసరాతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం. అమరావతిని మళ్లీ పట్టాలెక్కిస్తున్నాం,” అని చంద్రబాబు పేర్కొన్నారు.
రైతుల పోరాటాన్ని ప్రస్తావిస్తూ, “అమరావతి కోసం 34,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. వారు వీరోచితంగా పోరాడారు. అమరావతి ఉద్యమం లాంటి ఉద్యమాన్ని నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. ఇది రైతుల విజయగాథ,” అని అభిప్రాయపడ్డారు.

