Dimple Hayathi: తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఏడేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న డింపుల్ హయాతి కెరీర్లో ఒక్క హిట్ కూడా లేదు. ‘గల్ఫ్’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి, తమిళంలో ‘అభినేత్రి 2’, హిందీలో ‘అత్రంగి రే’ లాంటి ఓటీటీ చిత్రాలు చేసినా ఆమెకు విజయం దక్కలేదు. ‘గద్దలకొండ గణేష్’లో స్పెషల్ సాంగ్, ‘కిలాడీ’, ‘రామబాణం’ చిత్రాల్లో నటించినా ఫలితం సున్నా. న్యూమరాలజీ కోసం ‘హయాతి’ జోడించినా ఆమె అదృష్టం మారలేదు. రెండేళ్లుగా సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉన్న డింపుల్‌కు శర్వానంద్ 38వ చిత్రం ‘భోగి’లో హీరోయిన్గా ఛాన్స్ దక్కింది.
ఇక శర్వానంద్ కూడా ‘మనమే’, ‘మహాసముద్రం’, ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ వంటి వరుస ప్లాపులతో సంక్షోభంలో ఉన్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోగి’ ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా. వరుస ఫ్లాపుల నేపథ్యంలో కలిసిన ఈ జోడి కెరీర్‌ను ఈ సినిమా గాడిలో పెడుతుందా? ఫలితం కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.