Hit 3: నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన భారీ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్ 3’ సంచలనం సృష్టిస్తోంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఈ చిత్రం నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా యూఎస్ మార్కెట్లో నాని క్రేజ్‌కు తిరుగులేదు! ప్రీమియర్ షోల వసూళ్లుగా ఏకంగా 8 లక్షల డాలర్ల మార్క్‌ను టచ్ చేసిన ఈ సినిమా, డే 1తో కలిపితే సునాయాసంగా 1 మిలియన్ డాలర్ల గడ్డను అధిగమించనుంది.
Also Read: Hit 3 Twitter Review: హిట్ 3 ట్విట్టర్ రివ్యూ… థియేటర్స్ లో రెస్పాన్స్ ఎలా ఉందంటే..?
Hit 3: మిక్కీ జే మేయర్ సంగీతం అదిరిపోగా, వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. యూఎస్‌లో నాని మరోసారి తన స్టామినా చూపిస్తూ, బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. ‘హిట్’ సిరీస్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచేలా కనిపిస్తున్న ఈ మూవీ, నాని రేంజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్తోంది.