Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో సోషియో-ఫాంటసీ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ ఆలస్యం కావడంతో ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ చిత్రం వల్ల మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘ఘాటీ’ రిలీజ్‌కు అడ్డంకులు ఎదురవుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘ఘాటీ’ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నప్పటికీ, మేకర్స్ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ రెండు చిత్రాలను యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా, మెగాస్టార్ ‘విశ్వంభర’కు ప్రాధాన్యత ఇచ్చే దిశగా ప్లాన్ చేస్తున్నారు. ‘విశ్వంభర’ రిలీజ్ అనంతరం ‘ఘాటీ’ని గ్రాండ్‌గా ప్రమోట్ చేసి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో ‘ఘాటీ’ అభిమానులు కొంత నిరాశలో ఉన్నారు. ‘విశ్వంభర’ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ‘ఘాటీ’ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుంది? వేచి చూడాలి!

