Devara Part-2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. జపాన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు సమాచారం.
డైరెక్టర్ కొరటాల శివ ఈ సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులపై ఫోకస్ చేసిన కొరటాల, తన టీమ్‌తో కలిసి ఆసక్తికరమైన విజువల్స్‌ను సిద్ధం చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో కొత్త ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read: Rajamouli: రాజమౌళి ‘మహాభారతం’లో నాని.. అధికారిక ప్రకటన!
Devara Part-2: ఈ ఏడాది నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం సినిమాకు మరో హైలైట్‌గా నిలవనుంది. ‘దేవర పార్ట్-2’ మరో బ్లాక్‌బస్టర్‌గా రూపొందుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

