Visakha, Guntur Mayer: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ, గుంటూరు మేయర్లుగా కూటమి అభ్యర్థులు సోమవారం ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా కూటమి కైవసం చేసుకున్నది. విశాఖ నగర మేయర్ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికైంది. మేయర్‌గా షీలా శ్రీనివాస్రావు ఎన్నికయ్యారు. గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు.
Visakha, Guntur Mayer: విశాఖ మహానగర పాలకవర్గం (జీవీఎంసీ) సమావేశంలో ఉదయం 11 గంటలకే సమావేశమైంది. ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నిక సమావేశానికి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరయ్యారు. ఇప్పటికే కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన పీలా శ్రీనివాస్‌రావు పేరును అధిష్టానం ప్రకటించింది.
Visakha, Guntur Mayer: మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాస్‌రావు పేరును జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ప్రతిపాదించగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రావు బలపరిచారు. దీంతో మేయర్ అభ్యర్థిగా శ్రీనివాస్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా, మేయర్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ పీలా శ్రీనివాస్‌రావు ఎన్నికను ప్రకటించి, ఎన్నిక ధ్రువపత్రాన్ని అందజేశారు.
Visakha, Guntur Mayer: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. కూటమి బలపరిచిన రవీంద్రకు 34 ఓట్లు రాగా, వైఎస్సార్‌పార్టీ మద్దతు ఇచ్చిన వెంకట్‌రెడ్డికి 27 ఓట్లు వచ్చాయి. దీంతో మేయర్‌గా రవీంద్ర ఎన్నికైనట్టు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి భార్గవ్ తేజ ప్రకటించారు.
Visakha, Guntur Mayer: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా సోమవారం జరిగింది. ఈ ఎన్నికల్లో ఐదో వార్డు కౌన్సిలర్ సెల్వరాజును టీడీపీ అభ్యర్థిగా, 9వ వార్డు కౌన్సిలర్ ఎస్‌డీ హఫీజ్‌ను వైసీపీ ప్రతిపాదించి, ఎన్నికల్లో పోటీకి నిలిపాయి. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి సెల్వరాజుకు 15 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి హఫీజ్‌కు 3 ఓట్లే వచ్చాయి. దీంతో కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా సెల్వరాజు ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి శ్రీనివాస్‌రావు ధ్రువీకరించారు.