మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో రోడ్డుపై మద్యం పారింది. మద్యం లోడ్ తో వెళ్తున్న కంటైనర్ ని వేరే వాహనాలు ఢీకొట్టడంతో మద్యం సీసాలు నేలపాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల హైవేపై లిక్కర్ బాటిళ్ల లారీ బోల్తా పడింది. అక్టోబర్ 24 నాడు తెల్లవారు జామున జడ్చర్ల కొత్త బస్టాండ్ సమీపంలో ఆగివున్న లిక్క్ కంటైనర్ను వరుసగా లారీలు ఢీకొట్టాయి. దీంతో కంటైనర్ బోల్తాపడింది. కంటైనర్ నుంచి మద్యం సీసాలు రోడ్డుపై పడ్డాయి.
ఇంకేముంది ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఎగబడ్డారు. నాకంటే నాకని మద్యం సీసాలను ఏరుకున్నారు. హైవేపై ట్రాఫిక్ స్తంభించడంతో వెంటనే పోలీసులు వచ్చారు. అక్కడ ఉన్న వారిని చివర కొట్టే ప్రయత్నం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.