PM Modi : జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మృత్యువాతపడగా, ఇందులో ఇద్దరు విదేశీయులున్నారు. ఈ ఘటనపై దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాల నుంచి కూడా ఖండించారు.
ఈ సందర్భంగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ, బాధిత కుటుంబాలకు న్యాయం జరగటం ఖాయం అని హామీ ఇచ్చారు. దేశం మొత్తం ఉగ్రవాదంపై పోరాటానికి ఏకమై ఉందని, 140 కోట్ల భారతీయుల సంఘీభావం మన బలమని ఆయన అన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడమే కాక, వారు మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు.
పహల్గామ్ ఘటనపై ప్రధాని వ్యక్తిగతంగా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. “ఈ దాడి దృశ్యాలను చూసిన ప్రతి భారతీయుడి గుండె కలిచివేసింది. ఇది ఉగ్రవాదుల పిరికితనాన్ని చూపుతుంది. కాశ్మీర్ అభివృద్ధిని చూసి కొంతమంది శత్రువులు తట్టుకోలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారు” అని ఆయన అన్నారు.
PM Modi : కాశ్మీర్ పురోగతిని తట్టుకోలేకపోయారు, ఇక్కడ పాఠశాలలు, కళాశాలలు కొనసాగుతున్నాయి. పర్యాటకుల రాకపోకలు పెరిగాయి. ప్రజల ఆదాయాలు మెరుగవుతున్నాయి. యువతకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఈ శాంతి, అభివృద్ధిని చూశే శత్రువులే ఈ దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడి తర్వాత ప్రపంచ దేశాల నుంచి ఖండనలు వెల్లువెత్తాయని మోదీ తెలిపారు. చాలా మంది ప్రపంచ నాయకులు ఫోన్ చేసి తమ విచారం తెలియజేశారని చెప్పారు.
Also Read: Bharat vs Pak War Alarm: భారత ఆర్మీ సింహ గర్జన.. త్రివిధ దళాలు సంసిద్ధం!
ఇక ‘మన్ కీ బాత్’లో మోదీ మరో కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. మయన్మార్‌లో జరిగిన భూకంపంపై స్పందిస్తూ, భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ బ్రహ్మ’ను గుర్తు చేశారు. “ఆపరేషన్ బ్రహ్మలో పాల్గొన్న ప్రతీ ఒక్కరిపై దేశం గర్వపడుతోంది” అని తెలిపారు.
PM Modi : పర్యావరణ పరిరక్షణ కోసం ‘ఏక్ పెడ్ మా కే నామ్’ ప్రచారాన్ని ప్రస్తావిస్తూ, గత సంవత్సరం ప్రారంభమైన ఈ ఉద్యమం ఫలితంగా దేశవ్యాప్తంగా 1.4 బిలియన్లకు పైగా చెట్లు నాటినట్లు చెప్పారు.
ఇస్రో శాస్త్రవేత్తల కృషి, దేశాభివృద్ధిలో వారి పాత్రను ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు. ప్రైవేట్ పెట్టుబడులు రావడంతో స్పేస్ స్టార్టప్‌లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. కస్తూరీరంగన్ నాయకత్వంలో కొత్త విద్యా విధానం రూపకల్పన జరగడం, ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగానికి 50 సంవత్సరాలు పూర్తవ్వడం వంటి విషయాలను కూడా ఆయన ప్రస్తావించారు.

