AP News:

AP News: అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై ర‌ఘు క‌ళాశాల యాజ‌మాన్యం చ‌ర్య‌లు

AP News:విద్యార్థి లోకానికే మ‌చ్చ తెచ్చేలా.. గురుస్థానాన్ని కించ‌ప‌రిచేలా జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌పై ఆ క‌ళాశాల యాజ‌మాన్యం స్పందించింది. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ను ఏకంగా చెప్పుతో కొట్టిన ఘ‌ట‌న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై మ‌న‌స్తాపం చెందిన ఆ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ త‌న ఉద్యోగానికి రాజీనామా చేశారు. తోటి ఫ్యాకల్టీలు ఎంత‌గా వారించినా ఆమె విన‌కుండా త‌న రాజీనామా ప‌త్రాన్ని క‌ళాశాల యాజ‌మాన్యానికి ఇచ్చి వెళ్లిపోయారు.

AP News:ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వైజాగ్ స‌మీపంలో ర‌ఘు ఇంజినీరింగ్ క‌ళాశాల‌లో ఇటీవ‌ల ఈ ఘ‌ట‌న జ‌రిగింది. త‌ర‌గ‌తి గ‌దిలోకి ఓ విద్యార్థిని సెల్ ఫోన్ తెచ్చింది. తేవ‌డంతోపాటు ఇత‌ర విద్యార్థుల వీడియోలు, ఫొటోలు తీస్తున్న‌దంటూ వారంతా అభ్యంత‌రం వ్య‌క్తంచేస్తూ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఇది మంచి ప‌ద్ధ‌తి కాదంటూ ఆ అధ్యాప‌కురాలు ఆ విద్యార్థిని వ‌ద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకున్నారు.

AP News:దీంతో రెచ్చిపోయిన ఆ విద్యార్థిని క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లోనే పెడ‌బొబ్బ‌లు పెడుతూ తన సెల్‌ఫోన్ ఇవ్వాల‌ని, లేదంటే చెప్పుతో కొడ‌తానంటూనే వెళ్లి చెప్పుతో కొట్టింది. దీంతో హ‌తాశురాలైన ఆ అధ్యాప‌కురాలు తేరుకొని ఆ విద్యార్థినిపై చేయి చేసుకున్న‌ది. ఇద్ద‌రూ కొద్దిసేపు పెనుగులాడ‌గా, తోటి అధ్యాప‌కులు వారించారు. ఈ ఘ‌ట‌న‌ను కొంద‌రు విద్యార్థులు వీడియో తీయ‌గా, అది వైర‌ల్‌గా మారింది.

AP News:ఈ విష‌య‌మై మ‌న‌స్తాపంతో ఆ అధ్యాప‌కురాలు రాజీనామా చేయ‌డంతో ర‌ఘు క‌ళాశాల యాజ‌మాన్యం ప్ర‌త్యేక స‌మావేశ‌మైంది. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌పై చేయి చేసుకున్న విద్యార్థిని త‌ల్లిదండ్రుల‌కు క‌ళాశాల‌కు రావాల్సిందిగా స‌మాచారం పంపారు. అయినా వారు రాలేదు. త‌మ కూతురుకు కొంత మ‌తిస్థిమితం స‌రిగా లేదని, అందుకే అలా చేసి ఉండొచ్చ‌ని క‌ళాశాల యాజ‌మాన్యానికి ఆ విద్యార్థిని త‌ల్లిదండ్రులు స‌మాచారం పంపార‌ని తెలిసింది.

AP News:అయినా ర‌ఘు ఇంజినీరింగ్ క‌ళాశాల యాజ‌మాన్యం సంతృప్తి చెంద‌లేదు. అస‌లు ఆ ఘ‌ట‌న‌పై ఆ విద్యార్థినిదే త‌ప్ప‌ని తేల్చారు. ఆమెపై చ‌ర్య‌లు తీసుకునేందుకే క‌ళాశాల యాజ‌మాన్యం స‌మావేశంలో నిర్ణ‌యించారు. ఆ మేర‌కు అధ్యాప‌కురాలిని చెప్పుతో కొట్టిన క‌ళాశాల విద్యార్థిని గురుగుబెల్లి వెంక‌ట‌ల‌క్ష్మిని సస్పెండ్ చేస్తూ ర‌ఘు ఇంజినీరింగ్ క‌ళాశాల తీర్మానించింది. ఆ మేర‌కు ఓ నోట్‌ను విడుద‌ల చేసింది. మ‌రి అవ‌మానానికి గురైన ఆ అధ్యాప‌కురాలు మ‌ళ్లీ ఉద్యోగంలోకి చేరుతుందో? లేదో? చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *