Suicide Case: పుట్టిన కొడుకు తెల్లగా, అందంగా ఉన్నాడని భార్యపై అనుమానం పెంచుకున్నాడు ఆమె భర్త. నిత్య వేధింపులతో సతాయించేవాడు. సూటిపోటి మాటలతో హర్ట్ చేసేవాడు. ఒక రోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా ఏడాదిపాటు ఆ వేధింపులు తగ్గలేదు. ఇక ఈ వేధింపులు జీవితం ఉన్నంత వరకూ తప్పవని అనుకున్నదో ఏమో, తల్లిగారింటికి వెళ్లిన ఆమె అద్దంపై ఆనవాళ్లు రాసి తనువు చాలించింది. లక్ష్మీప్రసన్న కుటంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Suicide Case: జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన లక్ష్మీప్రసన్న (29)కు, వెల్గటూరు మండలం రాంనూర్ గ్రామానికి చెందిన తిరుపతికి రెండేండ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఏడాది క్రితం వీరికి పండంటి కొడుకు పుట్టాడు. అక్కడే వీరిద్దరి మధ్య భేదాభ్రియాలకు దారితీసింది. ఎవరైనా కొడుకు పుట్టిండంటే ఎగిరి గంతేస్తాడు. కానీ, మనోడు ఏడ్చి కూర్చున్నాడు.
Suicide Case: తమ ఇద్దరం చామనఛాయ రంగులో ఉంటే కొడుకు తెల్లగా, అందంగా పుట్టాడన్న అనుమానం తిరుపతిలో పెరిగి పెనుభూతంగా మారింది. ఈ విషయమై భార్య లక్ష్మీ ప్రసన్నను నిత్యం వేధించసాగాడు. ఆయన పెట్టే టార్చర్‌కు ఆమె నిత్యం దుఃఖభారంతో కుమిలిపోయింది. ఏకంగా ఉద్యోగమే మానేసి ఇంట్లోనే ఉండసాగింది.
Suicide Case: దీనికి తోడు కట్నం డబ్బు కూడా మొత్తం చెల్లించలేదని అత్తామామల వేధించేవారు. ఇటు భర్త వేధింపులు భరించలేక, అత్తామామల కట్నం వేధింపుల తాళలేకపోయింది ఆ ఇల్లాలు. ఈ వేధింపులు ఇక సమసిపోవని, జీవితమంతా భరించాల్సి వస్తున్నదని మనస్తాపం చెందింది. ఐదు రోజుల క్రితం లక్ష్మీ ప్రసన్న తన తల్లిగారింటికి వచ్చింది.
Suicide Case: తీవ్ర వేధింపులకు గురైన లక్ష్మీప్రసన్న తన తల్లిగారి ఇంట్లో ఉన్న అద్దంపై ఆనవాళ్లు ఇలా రాసింది. అమ్మానాన్న నాకు బతకాలని లేదు. నాకొడుకు జాగ్రత్త. ప్లీజ్ వాళ్లకు మాత్రం నా బాబును ఇవ్వకండి.. అని రాసి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. తమ కూతురు చావుకు భర్త, అత్తమామలే కారణమని లక్ష్మీప్రసన్న తండ్రి ఫిర్యాదు మేరకు తిరుపతి, అతని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.