YCP Direction Nani Game: వైసీపీ డైరెక్షన్లోనే కేశినేని నాని కొత్త గేమ్ మొదలైందా? కొద్దిరోజులుగా మాజీ ఎంపీ కేశినేని నాని వ్యవహారశైలే వివాదాస్పదంగా ఉంటోంది. మొన్న చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కూడా బాబుపై అమాంతం ప్రేమ కురిపిస్తూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు కేశినేని నాని. ఇదేందబ్బా.. ఇంత మార్పు అనుకునేలోపు అసలు గేమ్ మొదలెట్టాడు పెద్దబ్బాయ్ కేశినేని నాని. తాజాగా URSA.. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని బినామీ కంపెనీ అంటూ సొంత తమ్ముడిపైనే ఓ ‘బురద’ పోస్టు సంధించాడు. ఈ పోస్టు చూసిన వారంతా… “చంద్రబాబుపై అమాంతం అంత ప్రేమ కురిపించే సరికి అవాక్కయ్యాం కానీ… ఇదయ్యా మీ అసలు రూపం” అంటూ కేశినేని నాని పోస్టుకు రిప్లైలు పెడుతున్నారు.
వైసీపీ ఆదేశాల మేరకే కేశినేని నాని ఎంట్రీ ఇచ్చి, అర్సా క్లస్టర్స్పై బురదజల్లే బాధ్యత భుజానికెత్తుకున్నారని, పనిలో పనిగా తమ్ముడినీ టార్గెట్ చేశాడనీ విమర్శలు వినబడుతున్నాయి. అదే నిజమైతే.. వైసీపీ డైరెక్షన్లో కేశినేని నాని గేమ్ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయినట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. ఎందుకంటే తన సొంత తమ్ముడు కేశినేని చిన్నిపై.. కేశినేని నాని ప్రదర్శించే ద్వేషం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. వేరెవరైనా ఎంపీ కేశినేని చిన్నిపై ఈ ఆరోపణ చేసి ఉన్నా.. ఎంతో కొంత ఫలితం ఉండేదేమో కానీ… తమ్ముడిని రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆజన్మ శత్రువుగా భావించే కేశినేని నాని ఈ ఆరోపణలు చేయడం అంటేనే.. అందులో నిజం పాళ్లు ఎంతన్నది ఈజీగానే ఊహించొచ్చు. అందుకే నెటిజన్లు కేశినేని నానిని ఫేస్బుక్ పోస్టుపై కామెంట్లు, ట్రోల్స్ చేస్తూ ఒక ఆట ఆడుకుంటున్న పరిస్థితి.
కేశినేని నాని ఆరోపణలపై జనాల్లో స్పందన ఎలా ఉందో చూస్తే చాలు.. ఆయన ప్రయత్నం విఫలయత్నమని ఇట్టే తెలిసిపోతుంది. నమ్మిన వాళ్లని వెన్నుపోటు పొడవడంలో జగన్, కేశినేని నాని ఇద్దరూ ఎక్స్పర్ట్సే అంటున్న నెటిజన్లు.. కేశినేని నాని ప్రతి అడుగు విశ్వాసఘాతుకత, ద్వేషంతో నిండినవే అంటూ విమర్శిస్తున్నారు. సొంత తమ్ముడి విజయాన్ని జీర్ణించుకోలేకే విషం కక్కుతున్నాడని మండిపడుతున్నారు. ఎంపీ కేశినేని చిన్నికి ప్రజల్లో వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేకే ఈ ఆరోపణలంటూ తేల్చేస్తున్నారు. టీడీపీలో ఉంటూ వైసీపీకి కొమ్ముకాసిన నాని… నేడు మళ్లీ వైసీపీ డైరెక్షన్లో కొత్త నాటకం మొదలు పెట్టారని విరుచుకుపడుతున్నారు.
Also Read: Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్ట్
YCP Direction Nani Game: చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పినప్పుడే అర్థమైందంటున్న తమ్ముళ్లు… నేడు సజ్జల స్క్రిప్టును పోస్టు చేసి, నిజ స్వరూపం బయటపెట్టుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. Sun ఫార్మా లాంటి కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు దాని దగ్గర వేల కోట్లు లేవు. ఏ స్టార్టప్ కంపెనీ అయినా చిన్నగానే స్టార్ట్ అవుతుంది. ఈ మాత్రం కూడా మాజీ ఎంపీకి తెలియదా అంటూ కౌంటర్లిస్తున్నారు నెటిజన్లు. ఫేక్ ప్రచారాల్లో ఆరితేరిన వైసీపీ వాసనలు నానికి ఇంకా పోయినట్టు లేదంటూ ట్రోల్స్ చేస్తున్నారు. వైసీపీ కోసం A2 అవతారం ఎత్తిన కేశినేని నాని అంటూ పంచ్‌లు విసురుతున్నారు. Ursa క్లస్టర్స్ పూర్తిగా పారదర్శకంగా ముందుకెళ్తోంది.. రాష్ట్రానికి మేలు చేసే ఉద్దేశంతో ప్రణాళికతో పనిచేసుకుంటూ వెళ్తోంది.. రాజకీయ కక్ష్యల కోసం ఒక మంచి ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు బాధాకరం అంటూ గడ్డి పెడుతున్నారు నెటిజన్లు.
కేశినేని నాని ఆరోపణలపై ప్రజల నుండి వస్తోన్న స్పందన చూస్తుంటే.. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన నానిని రంగంలోకి దించి వైసీపీ వ్యూహాత్మక తప్పిదం చేసిందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. ఏది ఏమైనా కేశినేని నాని ట్వీట్‌తో ‘అర్సా’పై జరుగుతోన్న రాజకీయ కుట్రలు బట్టబయలు అయ్యాయంటున్నారు పరిశీలకులు.

